జగిత్యాల, అక్టోబర్ 11
పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో నవదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి 5వ రోజు అమ్మవారికి సోమవారం మహా పూజ, శత చండీ హావనం, మంత్రపుష్పం, బిల్వర్చిన నిర్వహించారు. సాయంత్రం దీపోత్సవం, అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. బోనాల పండుగ సందర్భంగా దీపోత్సవంను నిరాడంబరంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారి చుట్టూ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు సమయానుకూలంగా అమ్మవారికి వద్ద బోనం సమర్పించి మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాలయంలోకి వచ్చే భక్తులకు కోవిడ్19 నిబంధనలతో తప్పనిసరి మస్క్, శానిటేషన్ ఏర్పాట్లు చేశారు. వేద బ్రాహ్మణుల మంత్రోత్సరణల మద్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, భక్తులు, కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు.