తుగ్గలి మండల పరిధిలోని మారేళ్ళ గ్రామంలో వైద్య శాఖ అధికారులు కంటి చూపు సమస్యలతో సతమతమవుతున్న వృద్దులకు వైస్సార్ కంటి వెలుగు ద్వారా పరీక్షలు నిర్వహించారు.శనివారం రోజున నిర్వహించిన కంటి వెలుగు పరీక్షల కార్యక్రమానికి 34 మంది హాజరు కాగా అందులో నలుగురు కంటి శుక్ల సమస్యతో ఉండగా,మిగిలిన 30 మంది మందగించిన కంటి చూపుతో సమస్యలు కలిగి ఉన్నారని తుగ్గలి ప్రాథమిక వైద్యశాల మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ తెలియజేసారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.