ఖమ్మం,
ఖమ్మం నగరంలో శుక్రవారం నాడు ధర్నాచౌక్లో వైస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైస్సార్ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా కో- ఆర్డినేటర్ తుంపాల కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు . నిరంజన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని , వెంటనే బర్తరఫ్ చెయ్యాలని , మహిళల పట్ల టీ ఆర్ ఎస్ మంత్రుల వైకరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు . అనంతరం వారు మాట్లాడుతూ…. తెలంగాణ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉండవలసిన మంత్రులు నోరు అదుపు తప్పి మాట్లాడటం బాగా అలవాటు అయిందని , నిరుద్యోగుల గురించి షర్మిల నిరాహార దీక్షలు చేస్తుంటే వారి పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుంటే జీర్ణించుకోలేకుండా , కుళ్లు కుతంత్రాలతో రాజకీయం చేస్తూ ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని , అతి త్వరలో మహిళలంతా ఏకమై తగిన గుణపాఠం చెప్తారని , ఇప్పటికైనా మీ ఒళ్ళు నోరు అదుపులో ఉంచుకోకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు . మీకు తల్లి చెల్లి అక్క లేరా ? మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా ? భార్యా బిడ్డలు లేరా ? మీవాళ్ల గురించి ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడితే మీకు ఎలా వుంటుంది ? మీకు సంస్కారం నేర్పలేదా నీ తల్లి దండ్రులు ? తెలంగాణ రాష్ర్టం ఆడపడుచులను గౌరవిస్తుందని ప్రపంచానికి తెలుసు . టీ ఆర్ ఎస్ మంత్రులు ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం . తెలంగాణ లో మహిళలను దేవతగా కొలుస్తారు . ఇదే విధంగా కవితను అంటే ఊరుకుంటారా అని ప్రశ్నించారు . ఇలాంటి కుక్కలను దేశం నుండి తరిమి తరిమి కొట్టే రోజులు అతి దగ్గర్లో ఉన్నాయన్నారు . టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు , మహిళలకు రక్షణ లేదని , గతంలో మహిళలపై జరిగిన అకృత్యాల ఘటనలు ఎన్నో ఉన్నాయని , అభం శుభం తెలియని చిన్నారులపై అలాగే దళిత మహిళలపై దాడులు ఉన్నాయని సందర్భంగా గుర్తుచేశారు . ఇలాంటి నియంత్ర పాలన కొనసాగుతుందని ప్రజలు గ్రహించాలని పేర్కొన్నారు . మహిళా ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు . ఈ కార్యక్రమంలో లక్కినేని సుధీర్, వాలూరి సత్యం, వీర రెడ్డి, మురళి , నాగరాజు ఆలస్యం రవి, రాంబాబు , రాఘవులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు .