డోన్
డోన్ పాతపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ప్రధాన ఉఫాధ్యారాలు పద్మావతీ అధ్యక్షతన
ఘనంగా నిర్వహించారు,స్థానిక పట్టణంలో
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సోమవారం ఉదయం ప్రధానోపాధ్యాయులు పద్మావతమ్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు, ముందు గా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించినట్లు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు,ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష తోనే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అయిందని అన్నారు, పొట్టి శ్రీరాములు చెన్నై లో జన్మించి, ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం చేస్తూనే, రాజీనామా చేసి, గాంధీజీ బాటలో అహింసా మార్గంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు,సబర్మతి ఆశ్రమం లో చేరి గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం జరిగింది, స్వాతంత్రం ప్రకటించిన తర్వాత తెలుగు వారి కోసం మద్రాసు రాష్ట్రం నుండి భాషా ప్రాతిపదికన రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 58 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి అమరజీవి అయ్యాడు.ఆ తరువాత అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1953 అక్టోబర్ 1 న కర్నూలు కేంద్రం గా ఆంధ్ర రాష్ట్రం అవతరించగా, హైదరాబాద్ విలీనం కాగా 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ను ఏర్పాటు చేసారు, అదేవిధంగా విద్యార్థులు తీసుకో వలసిన జాగ్రత్తలు, సూచనలు సలహాలు తెలిపారు.ముఖ్యంగా మాస్క్ ధరించడం,శానిటైజర్ వాడడం, వాటర్ బాటిల్ తీసుకుని రావడం, ఇతరుల వస్తువులను (పెన్ను, పుస్తకాలు) తాకకుండా ఉండడం, కేటాయించిన సీట్లలో కూర్చోవడం,6అడుగుల దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంలో పలుసూచనలు యిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు శివ ప్రసాద్, వెంకట రమణ, లక్ష్మయ్య, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాసులు, సుబ్బారాయుడు,లక్ష్మి కాంత రెడ్డి, వెంకట లక్ష్మీ,రాధ,మధు సూధన్ రెడ్డి, లీలావతమ్మ, సురేష్, సుభాన్, అల్లిపీరా, రమేష్,జయ సుబ్బారాయుడు, భాను ప్రకాష్ రెడ్డి, శ్రీనివాసులు, లక్ష్మి ప్రభావతి, ఆదినారాయణ, మునిరాజు,ప్రసాద్ రావు, తదితరులు పాల్గొన్నారు