డోన్
24 వ తేదీన సార్వత్రిక సమ్మె కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు ఆంద్రప్రదేశ్
అంగన్వాడీ వర్కర్స్మరియు హెల్పర్స్ అసోసియేషన్ డోన్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాందిని తెలిపారు, స్థానిక డోన్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ ,మరియు హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు వచ్చినప్పుడు
ఆశ వర్కర్లుకు,అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ లను బాగా ఉపయోగించు కొని ,బకాయిలు తగినంత పారితోషకం ఇవ్వకుండా ఉండడం దారుణం అని ఆమె అన్నారు, అలాగే అంగన్వాడీ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగ భద్రత,పి యఫ్, ఈయస్ ఐ, పెన్షన్ ఇవ్వాలని, అలాగే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనాలను అంగన్వాడీ వర్కర్స్ 1500/-,హెల్పర్స్ 750/- రూపాయిలు పెంచిన ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు అనీ,అందుకే 24 వ తేదీన దేశ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు, అందుకే ముందుగా ఐసీడీఎస్ అధికారిని కలసి వినతిపత్రం అందజేడం జరిగింది, ఈ కార్యక్రమంలో సువర్ణ,ఎస్తేరు, తదితరులు అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు