కౌతాళం
పంటలు ఎండుముకం పట్టడంతో రైతన్నలు అందరూ ఆవేదన చెందారు వర్షం లేదని దిగులు చెందారు. గ్రామ ప్రజలందరూ వర్షం కోసం తుంగభద్ర నదికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి మళ్లీ కాలినడకతో గ్రామానికి చేరారు. గ్రామానికి చేరడంతో గ్రామ ప్రజలందరూ భక్తితో దీపారాధనతో మేళతాలలతో బారి వర్షాలు వారికి ఘన స్వాగతం పలికారు. తుంగభద్ర నీటి తో మారి కంబా దేవికి మరియు దేవాలయాలు అన్ని అమ్మవారికి నీటితో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షం రావాలని పంటలు బాగా పండాలని అమ్మవారిని కొలిచారు.రాత్రి 12గంటలు నుంచి భారీ వర్షాలు పాడటం తో రైతన్నలు ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాలకు పంటలు మొక్కలు కళకళ లాడయి. గ్రామ ప్రజలు అమ్మవార్లకు బచ్చలు, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం గ్రామ పెద్దలు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాలు పడటంతో రైతుల ముఖం లో ఆశలు చిగురించాయి.