Home ఆంధ్రప్రదేశ్ హిందూ వ్యతిరేక ఉగ్రవాదం నశించాలి విశ్వహిందూ పరిషత్

హిందూ వ్యతిరేక ఉగ్రవాదం నశించాలి విశ్వహిందూ పరిషత్

249
0

నంద్యాల
ఉగ్రవాద మూకల మరణ ఖాండకు నిరసనగా శనివారం నాడు నంద్యాల లో ధర్నా నిర్వహించారు.
కొన్ని వందల సంవత్సరాలు గా భారతదేశం లో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి సరిహద్దు ప్రాంతాలలో హిందువులపై జరుగుతున్న మారణ హోమాలు తగ్గుముఖం పడుతున్నాయనే అక్కసుతో ఎలాగైనా భారతదేశం లో కలసి మెలసి జీవిస్తున్నటువంటి వివిధ మతాల మధ్య  అంతర్గత చిచ్చు పెట్టే కుట్ర తో హిందూ వ్యతిరేక ఉగ్రవాదం మళ్ళీ తమ కోరలు చాచిందని
విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.  ఇటీవల శ్రీ నగర్ లోని ఒక పాఠశాల లో ఉపాధ్యాయుల సమావేశము జరుగుతుండగా కొందరు ఇస్లామిక్ తీవ్రవాదులు మారణాయుధాలతో వచ్చి వారిని ఒక వరుస లో నిల్చోబెట్టి తమ పేర్లు అడగటమే కాకుండా ఆధార్ కార్డులు చెక్ చేసి మరీ హిందువులైనటువంటి ప్రిన్సిపాల్ మరియుఉపాధ్యాయురాలిని కాల్చి చంపారన్నారు. నగర సహ కార్యదర్శి చిమ్మ రవి కుమార్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరిగినపుడు హిందూ సమాజమే కాకుండా రాజకీయ నాయకులు కూడా బయటకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు , ఆర్టికల్ 370 తీసివేయటం నోట్ల రద్దు లాంటి దేశ హిత కార్యక్రమాలతో నిర్వీర్యమైన ఉగ్రవాదుల కార్యకలాపాలు మళ్ళీ పాకిస్తాన్ సహాయం తో మొదలయ్యాయని ఇలాంటి చర్యలు మానుకోవాలని లేదంటే అఫ్గనిస్తాన్ కు పట్టిన గతే పాకిస్తాన్ కు పడుతుందని హెచ్చరించారు.
డా: ఉదయ్ శంకర్ మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాలు గా హిందువులు దాడులకు గురవుతున్నా చెక్కు చెదరని సమాజంగా ఉన్నారని ఇంకో లక్ష సంవత్సరాలు ప్రయత్నించినా భారత్ లో ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయలేరని అన్నారు. కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని జరిగిన సంఘటన చాలా బాధాకరం అని ఇలాంటి సంఘటనలను భారతీయ ముస్లిం లు కుడా ఖండించాలన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఐయస్ ఐ యస్ . లష్కర్ ఏ తోయిబా లాంటి ఉగ్ర సంస్థలు  హిందువుల పైనే కాకుండా ముస్లింల మసీదుల పై ఆత్మాహుతి దాడి ద్వారా 100 మంది అమాయక ముస్లిం ల ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారని ఆయన అన్నారు , కాబట్టి ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రం లో మన గ్రామంలో
జరగబోవు అనే నిర్లక్ష్య భావన వీడి హిందూ సమాజం జాగృతం కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి , వీహెచ్పీ జిల్లా కార్యదర్శి పోలేపల్లి సందీప్ , సంఘమిత్ర కార్యదర్శి చిలుకూరి శ్రీనివాస్ ,రాష్ట్ర సేవికా సమితి మరియు వివిధ హిందూ సంస్థల ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు

Previous articleమంత్రి హరీష్ రావు కారులో పోలీసుల సోదాలు
Next articleతైవాన్‌ను చైనా దేశంలో క‌లుపుకుంటాం: చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here