దర్శి
ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని వెంకటచలం పల్లి గ్రామ రైతు బరోసా కేంద్రం వద్ద గురువారం శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానీకి దర్శి మండల వ్యవసాయ అధికారి వి బాలకృష్ణ నాయక్,దర్శి మండల ఎంపీపీ సుధారాణి, వైస్ ఎంపీపీ సోము దుర్గ రెడ్డి, మరియు వెంకటాచలంపల్లి సర్పంచ్ అంకాల శ్రావణి హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సబ్సిడీ క్రింది అందజేస్తున్న విత్తన పథకాన్ని ప్రతి ఒక రైతు ఉపయోగించుకొని లబ్దిపొందాలని సూచించారు. శనగ 1క్వింట ధర సబ్సిడీ పోను 5175 ,రూపాయలకు రైతులకు ఇవ్వడం జరుగుతుంది అని మొత్తం గ్రామానికి 14 క్వింటాలు శనగ విత్తనాలు రైతులకు అందించడం జరిగిందని తెలియజేసారు. ఈ కార్యక్రమానికి దర్శి ఎంపీపీ గోళ్లపాటి సుధారాణి మరియు వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి , వెంకటాచలంపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ అంకాల శ్రావణి, గ్రామ వ్యవసాయ సహాయకులు ఆర్ జి సోమ్లా నాయక్, గ్రామ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.