అమరావతి నవంబర్ 17
ఏపీలో వైఎస్సార్‌సీపీని ఆదరించిన నగర, మున్సిపల్ ఓటర్లకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగిన స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపులో అధికార వైఎస్సార్‌సీపీకి పట్టం గట్టినందుకు ట్విటర్ ద్వారా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయని పేర్కొన్నారు.గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్లు, సోదరులందరికీ ట్విటర్‌లో ధన్యవాదాలు తెలిపారు.