అమరావతి నవంబర్ 29 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై వైద్యులు సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన విషయం తెలిసిందే.గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల నవంబరు 18 న కోవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని.. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి నవంబరు 28న విజయవాడలోని తన నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తిరిగి ఆదివారం అస్వస్థతకు గురయ్యారు