Home ఆంధ్రప్రదేశ్ ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

194
0

విజయవాడ నవంబర్ 9
ఏపీ పీజీసెట్‌ ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వైస్‌ చైర్మన్‌ రామ్మోహనరావు, యోగివేమన యూనివర్శిటీ వీసీ సూర్యకళావతి హాజరయ్యారు. తొలిసారి అన్ని యూనివర్శిటీలలో ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ఒకే పీజీ సెట్‌ నిర్వహించింది.ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించాం.  ఆన్‌లైన్ లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించాము. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత సాధించారు. పీజీ సెట్‌లో 87.62 శాతం మంది అర్హత సాధించారు.

Previous articleగంజాయి రవాణా, విక్రయాల మూలాలు, కీలక వ్యక్తుల పై పటిష్ట నిఘా ఉంచాలి తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పట్ల నిఘా ఉంచాలి గంజాయి నిర్మూలన అవగాహన సీడీ, పోస్టర్ ఆవిష్కరణ *జిల్లా ఎస్పీ సింధు శర్మ
Next articleనిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎలేటి మహిపాల్ రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here