తుగ్గలి
ఈ-క్రాప్ తోనే ప్రభుత్వ పథకాలు రైతులకు వర్తిస్తాయని ఏ.ఓ పవన్ కుమార్ తెలియజేసారు.గురువారం రోజున స్థానిక వ్యవసాయ కార్యాలయంలో మండల అగ్రికల్చర్ సలహా మండలి సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ-పంట నమోదు చేయించుకోవాలని,అలాగే పంట నమోదు కాకపోతే ఎటువంటి పథకాలు వర్తించవని,కావున ప్రతి రైతు పంట నమోదు చేయించుకోవాలని ఏ.ఓ తెలియజేశారు.పంట నమోదు అయిన తర్వాత రైతు తన వేలిముద్ర వేయాలని,అలాగే ప్రతి రైతుభరోసా కేంద్రంలో ఎరువులు,పురుగులు మరియు మందులు అందుబాటులో ఉన్నాయని ఏ.ఓ తెలియజేసారు.అనంతరం వెటర్నరీ డాక్టర్ మాట్లాడుతూ పశువులు,మేకలకు టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలియజేసారు. సెరికల్చర్ అసిస్టెంట్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పట్టు పరిశ్రమ సబ్సిడీ కింద షేడ్ నెట్ లు ఇవ్వబడునని,అలాగే ప్రకృతి వ్యవసాయం గురించి లింగన్న వివరించారు.ఈ కార్యక్రమంలో ఏ.ఓ పవన్ కుమార్,సెరికల్చర్ అసిస్టెంట్ నాగేశ్వర్ రెడ్డి,వెటర్నరీ ఆఫీసర్ లక్ష్మన్న,ప్రణీత మండల అగ్రికల్చర్ సలహా మండలి చైర్మన్ సోమశేఖర్ రెడ్డి,బోర్డు మెంబర్స్ లింగన్న, నాగేంద్ర,ఏఈఓ లు రంగన్న,లక్ష్మీ చైతన్య,విఏఏ లోహిత్ కుమార్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.