పత్తికొండ
టిడిపి రాష్ట్ర పార్టీ కార్యాలయంపై వైసిపి గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకుల పై వైసిపి గూండాలు చేసిన దాడులను తీవ్రంగా నిరసిస్తూరాష్ట్ర బందుకు టిడిపి రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. పత్తికొండలో నియోజకవర్గ ఇంచార్జ్ కే.ఈ.శ్యామ్ కుమార్ , ఇతర నేతలు మార్కెట్ యార్డు నంచి ర్యాలీగా వచ్చి బస్ స్టాండ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ రాస్తారోకో చేపట్టారు. షాపులను మూయిస్తూ నినాదాలు చేసారు. స్థానిక నాలుగు స్థంబాల దగ్గర పోలీసులు అడ్డుకుని నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఆటవిక పాలన సాగుతోంది. వైకాపా మూల్యం చెల్లించుకోక తప్పదని వారన్నారు.