పెద్దపల్లి నవంబర్ 19
గోదావరిఖని ఎఫ్.సీ.ఐ. సాయిబాబా గుడి ప్రధాన పూజారి మల్లెల కృష్ణ మోహన్ శర్మ కూతురు అశ్విని వివాహానికి తోడ్పాటు అందించారు కళానిలయం స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షులు గడ్డం సనత్ కుమార్ గౌడ్. ఈ మేరకు శుక్రవారం పూజారి గృహంలో 20 వేల రూపాయల నగదుతో పాటు బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పూజారి దీన గాథను చూసి చలించి సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ నకు దాతల నుంచి సహకారం లభించింది అని అన్నారు. రామగుండం స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొండపర్తి నరహరి, ఉపాధ్యక్షుడు జగన్ వారి మిత్రులు కలిసి రూ.20,000 వివాహం కోసం అందించిన సహకారం అభినందనీయమని అన్నారు. సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ బియ్యం అందజేశారని తెలిపారు. నిస్వార్థంతో కళానిలయం స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు దాతల నుంచి వచ్చే స్పందన మరువలేనిదని తెలిపారు. ఇంకా ఎవరైనా దాతలు ఉన్నట్లయితే వారికి సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.