తిరుమల,మా ప్రతినిధి,సెప్టెంబర్ 25,
టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులుగా డా. ఎస్.శంకర్ శనివారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.
ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టిటిడి జెఈవో సదా భార్గవి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీవారిని దర్శించుకున్న
అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, కాఫీ టేబుల్ బుక్‌ను జెఈఓ అందించారు