Home ఆంధ్రప్రదేశ్ ఘన విజయం సాధించిన 26వ డివిజన్ వైకాపా అభ్యర్థిని బూడిద సుప్రజా సంబరాలు చేసుకున్న డివిజన్...

ఘన విజయం సాధించిన 26వ డివిజన్ వైకాపా అభ్యర్థిని బూడిద సుప్రజా సంబరాలు చేసుకున్న డివిజన్ నాయకులు

191
0

నెల్లూరు  నవంబర్ 17
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ అభ్యర్థినిగా పోటీచేసిన బూడిద సుప్రజ కార్పొరేషన్ ఎన్నికలలో ఘన విజయం సాధించారు. నెల్లూరు నగర పాలక శాఖ పరిధిలోని 54 డివిజన్లు ఉండగా, వాటిలో 8 డివిజన్లను వైకాపా  ఏకగ్రీవం చేసుకుంది. ఈ నెల 15న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 46వ డివిజన్ లలో వైకాపా అభ్యర్థులు పోటీ చేశారు. అందులో భాగంగానే స్థానిక 26వ డివిజన్ వైకాపా ఇంచార్జి మరియు అభివృద్ధి కమిటీ చైర్మన్ బూడిద పురుషోత్తం యాదవ్ సతీమణి బూడిద సుప్రజా పోటీలో నిలిచారు. పురుషోత్తం యాదవ్ డివిజన్ ప్రజలకు అందించిన సేవా సహకార కార్యక్రమాలకుగాను సుప్రజను స్థానిక ప్రజలు  ఆదరించి విజయ ప్రధాన నిలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు వైకాపా నాయకులు కార్యకర్తలు అభిమానుల ఆశీస్సులు నా విజయానికి నాంది అని అన్నారు. డివిజన్ అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను డివిజన్ లోని ప్రతి ఒక్కరికి అందే విధంగా  తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Previous articleవైసిపి నాయకులు టిడిపి లో చేరిక మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్
Next articleబుచ్చిలో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ పక్రియను పరిశీలించిన కలెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here