Home వార్తలు జనవరి 26న విడుదల కానున్న అశోక్ గల్లా, శ్రీరామ్ ఆదిత్య ‘హీరో.

జనవరి 26న విడుదల కానున్న అశోక్ గల్లా, శ్రీరామ్ ఆదిత్య ‘హీరో.

75
0

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా మేకర్లు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ జనవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అశోక్ గల్లా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.
అశోక్‌ గల్లా కు ఇది మొదటి చిత్రమే అయినా కూడా టీజర్‌తోనే ఆకట్టుకున్నాడు. అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఎంతో పవర్ ఫుల్ రోల్‌లో అశోక్‌  గల్లాను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మరింత పవర్ ఫుల్‌గా చూపించారు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో అశోక్ గల్లా కనిపించబోతోన్నారు. శ్రీరామ్ ఆదిత్య భిన్న కథలతో భిన్న చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ ‘హీరో’ సినిమాను సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా మలచబోతోన్నారు.
హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఈ సినిమాలోని మొదటి పాట అయిన అచ్చ తెలుగందమే లిరికల్ వీడియోను విడుదల చేయగా..  ఆ పాట అందరినీ ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు జిబ్రాన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. త్వరలోనే మిగతా పాటలను  రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్‌లు కెమెరామెన్‌లు వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చంద్ర శేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నటీనటులు : అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య

Previous articleనవంబర్ 26న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలవుతున్న బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌బాబు,ఆర్కే మలినేని ‘క్యాలీఫ్లవర్‌’
Next article4 గంట‌ల మోదీ ప‌ర్య‌ట‌న‌కు రూ. 23 కోట్లు ఖ‌ర్చు!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here