కామారెడ్డి అక్టోబర్ 22
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలోనీ వీధి నందు ఈ రోజు సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అనోన్య ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి కాలనీలోని ప్రజలను చైతన్యవంతం చేయడమే కాకుండా 30 వేల రూపాయలు ఇచ్చిన విశ్వనాధుల అనిత మహేష్ గుప్తా ను, కాలనీ వాసులు 70 వేల రూపాయలను అందించడము అభినందనీయము అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కృష్ణ,పట్టణ ఎస్సై రాములు కౌన్సిలర్ వంశీకృష్ణ,గంజి సతీశ్,సంజీవ రెడ్డి,నర్సింలు, ప్రభాకర్, చీలశ్రీధర్, సాయి, శ్రీనివాస్, లచ్చిరెడ్డి కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది.