నెల్లూరు
నెల్లూరు జిల్లా,
ఆత్మకూరు జడ్పిటిసి సభ్యురాలు ప్రసన్న లక్ష్మి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఆమెతో పాటు శ్రీనివాసులు నాయుడు ఉన్నారు. ఈ సందర్భంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యురాలు ప్రసన్న లక్ష్మి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పూల బొకే అందజేసి ఆదాల ఆశీస్సులు పొందారు. ఆ తర్వాత ఆమె విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళాభ్యుదయం కోసం మహిళలకు ఒక ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తూ, రాజకీయ, ఉద్యోగ వివిధ రంగాలలో మహిళలు ముందుకు వెళ్లేందుకు ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని ఆయన సేవలను కొనియాడారు. తనపై నమ్మకంతో అప్పగించిన పదవీ బాధ్యతలను నెరవేరుస్తూ ఆత్మకూరు జిల్లా పరిషత్ పరిధిలోని ప్రాంతాల అభివృద్ధి, ప్రజాసంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.