Home ఆంధ్రప్రదేశ్ విజయవాడ లో దారుణం. వివాహమై ఏడాదిలోనే భార్య మృతి

విజయవాడ లో దారుణం. వివాహమై ఏడాదిలోనే భార్య మృతి

242
0

విజయవాడ
నెల్లూరు లో వివాహిత భర్త ముందు ఊరి వేసుకుని ఆత్మహత్య ఘటన మరువక ముందే… విజయవాడ లో మరో ఘటన జరిగింది.  భార్యాభర్తలు అంజన్ కృష్ణ, రేణుకలకు  వివాహం గత సంవత్సరం అక్టోబర్ లో జరిగింది. పెళ్లీ ఘనంగా చేసారు.

రెండు నెలల సక్రమంగా కాపురం జరిగింది. భర్త అంజన్ కృష్ణ మరో మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడం తో భార్య రేణుక మందలించింది. మరో మహిళ తో వివాహేతర సంబంధం బయట పటడంతో తమ కుమార్తె ను అల్లుడు చిత్రహింసలకు

గురిచేసేవాడని రేణుక కుటుంబసభ్యులు అరోపిస్తున్నారు. రేణుక అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. భార్యను అనేక మార్లు చనిపోవాలని తిట్టే వాడని… చివరకు చనిపోయేట్లు చేశాడని అల్లుడు పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డ

మరణానికి కారణమైన భర్త అంజన్ కృష్ణ ను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
పరారీలో భర్త  అంజన్ కృష్ణ
రేణుక మృతికి కారణమైన భర్త అంజన్ కృష్ణ  పరారీలో వున్నట్లు పోలీసులు అంటున్నారు. అతడికోసం గాలిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన విజయవాడ మొగల్రాజపురం సున్నం బట్టిల వద్ద

జరిగింది.

Previous articleరక్తదానం ద్వారా ఇతరుల ప్రాణాలు రక్షించవచ్చు – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ – బ్లడ్ డోనర్ల వివరాలతో జాబితా తయారు చేయాలి – టిఎన్జీఒ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్
Next articleట్రాక్టర్ లో మృతదేహం తరలింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here