Home జాతీయ వార్తలు బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు పలుచోట్ల ...

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలే లక్ష్యంగా దాడులు పలుచోట్ల కాల్పులు ముగ్గురు మృతి

133
0

న్యూ ఢిల్లీ అక్టోబర్ 14
బంగ్లాదేశ్‌లో విజయదశమిని నేపద్యం లో  హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకుని కొందరు దున్డుగలు దాడులకు పాల్పడ్డారు. దుర్గా పూజ సందర్భంగా ఏర్పాటుచేసిన పండల్స్‌ లక్ష్యంగా దాడులు జరిగాయి. పండల్స్‌లో ఏర్పాటుచేసిన పలు హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు.బంగ్లాదేశ్‌లో విజయదశమిని పురస్కరించుకుని ఎప్పటిమాదిరిగానే హిందూ సంస్థలు పండళ్లను ఏర్పాటుచేసి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాయి. ఈ పూజలంటే గిట్టని చాందసవాదులు చంద్‌పూర్ జిల్లాలోని హిందూ దేవాలయంపై గుంపు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో కాల్పులు చోటుచేసుకోవడంతో ముగ్గురు హతమయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దేవాలయాలపై ఇలాంటి దాడులు జరిగినట్లు సమాచారం అందింది. బంగ్లాదేశ్‌ చరిత్రలో ఇది దుర్దినం అని, ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని బంగ్లాదేశ్‌ హిందూ యూనిటీ కౌన్సిల్‌ విజ్ఞప్తిచేసింది.బంగ్లాదేశ్‌లోని హిందువులకు భద్రత కల్పించాలని బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాను బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్‌ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ముస్లింలు కోరుకోకపోతే హిందువులు పూజలు చేయరని, ఇదే సమయంలో సైన్యాన్ని రంగంలోకి దించైనా ఇక్కడి హిందువులను రక్షించాలని కౌన్సిల్ ట్వీట్ చేసింది.

Previous articleప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
Next articleజోగులాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన కర్నూలు జిల్లా కలెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here