Home తెలంగాణ ఔషధ నియంత్రణ ఏ డి డాక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో దాడులు పాల్గొన్న కామారెడ్డి...

ఔషధ నియంత్రణ ఏ డి డాక్టర్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో దాడులు పాల్గొన్న కామారెడ్డి డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, నిజామాబాద్ డి ఐ ప్రవీణ్

232
0

కామారెడ్డి నవంబర్ 23
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ:బాన్సువాడ పట్ణణంలో ఇటీవల లైసెన్స్ లేని మందుల దుకాణాలు ఉన్నాయని, ఫార్మసిస్టు లేకుండా ఫార్మసీ నడుస్తున్నాయని, ప్రిస్కిప్షన్ లేకుండా యాంటీ బయాటిక్ మందులు అమ్మకాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. వాటిపై ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఏడీ రాజ్యలక్ష్మి, కామారెడ్డి డ్రగ్ ఇన్స్‌పెక్టర్ శ్రీలత, నిజామాబాద్ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్‌ల ఆధ్వర్యంలో సోమవారం బాన్సువాడ పట్టణంలోని 13 మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి షాపులకు నోటీసులు ఇచ్చారు. ఔషధ నియంత్రణ శాఖాధికారులు తనిఖీకి వస్తున్నారని ముందే తెలిసి కొన్ని మెడికల్ షాపులు మూసివేయగా, శాంపిల్స్ అమ్మే దుకాణాల నిర్వహకులు అప్రమత్తమయ్యారు. 13 షాపులపై దాడులు నిర్వహించారు వీరు నిబంధనలను ఉల్లంఘించారని వీరికి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగిందని కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఏడి రాజ్యలక్ష్మి.

Previous articleఎన్టిపిసి వ్యర్థాల పై అధ్యయనానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ క‌మిటీ
Next articleఅన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం.. రైతులకు బాసటగా ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి *వరదల వల్ల దెబ్బతిన్న పాత కడప, వాటర్ గండి ప్రాంతాలలోని వరి పొలాలను పరిశీలించిన ఉపముఖ్యమంత్రి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here