ఒంగోలు
భూత వైద్యం పేరుతో మహిళను నమ్మించి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించిందంటూ గొడ్డలితో నరికి చంసాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ప్రతీకారేచ్ఛతో పోలీసుల ఎదుటే కర్రలతో ఆపై నిందితుడిని కొట్టి చంపారు. ఈ ఘటనతో ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామం ఆదివారం రాత్రి అట్టుడికింది. కామేపల్లి గ్రామానికి చెందిన వంకాయలపాటి విజయలక్ష్మి అలియాస్ విజయ(42) వ్యవసాయ కూలీ గాజీవనం సాగిస్తోంది. ఆమె కాళ్ల నొప్పులతో బాధపడుతోంది. గ్రామంలోని వడ్డెపాలెంలో తన్నీరు ఓబిశెట్టి (62) బేల్దారి పని చేస్తుంటాడు. అలాగే . చిన్నచిన్న సమస్యలకు మంత్రాలు వేస్తానని అంటుంటాడు. ఆదివారం సాయంత్రం ఓబిశెట్టి ఇంటికి విజయమ్మ వెళ్లింది. ఓబెశిట్టి తలుపులు వేసి ఆమెపై లైంగిక దాడికి యత్నించగా విజయమ్మ ప్రతిఘటించింది. పెద్దగా అరవడంతో కత్తితో గొంతుకోసి, ఒళ్లంతా పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులకు సమాచారం రావదతో రాత్రి ఎస్సై సుల్తానా రజియా ఘటనా స్థలానికి చేరుకుని ఓబిశెట్టిని స్టేషన్కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహించి ఓబిశెట్టిపై దాడి చేశారు. పోలీసు సిబ్బందిని దాటుకుని వెళ్లి దాడిచేసి తీవ్రంగా కొట్టడంతో ఓబిశెట్టి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.