Home తెలంగాణ సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి జిలా కలెక్టర్ జి. రవి

సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలి జిలా కలెక్టర్ జి. రవి

136
0

జగిత్యాల, నవంబర్ 26
జిల్లాలో ఎస్సీ కార్పోరేషన్ ఋణాలను అందించడంలో బ్యాంకు, ఈడి ఎస్సీ కార్పోరేషన్,ఎంపిడిఓ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని లబ్దిదారులకు ఋణాల మంజూరులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  శుక్రవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి  ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అభివృద్ది,  ఎస్సీ ఎపి 2017-18, 2018-19, 2019-20, 2020-21 సంవత్సరానికి ఎస్సీ కార్పో రేషన్ ద్వారా మంజూరు చేయబడి పెండింగులో ఉన్న యూనిట్లు  పై బ్యాంకు, ఎస్సి కార్పోరేషన్, ఎంపిడిఓ లతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సి కార్పోరేషన్ ద్వారా మంజూరు చేయబడి పెండింగ్ లో యూనిట్లకు నవంబర్ 30 లోగా గ్రౌండింగ్ పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని, అదేవిధంగా ప్రభుత్వం సబ్సీడి విడుదల చేసిన వారికి  రుణాలు మంజూరు చేసి, యూనిట్ల యుసిలు, ఫోటోలు అప్లోడ్ చేసేలా  బ్యాంకర్లు మండల ప్రజా పరిషత్తు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రౌండింగ్ చేయని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయాలని ఎల్.సి.ఎం, ఈ డి ఎస్సి కార్పొరేషన్ తెలిపారు. యువతకు ఉపాధి అందించడంలో అధికారులు చొరవ చూపాలని, జిల్లాలో డిజీటల్ చెల్లింపులకు ప్రాదాన్యానిస్తూ, డిజిటల్ చెల్లింపులు అధికంగా వుండేలా చుడాలని అన్నారు. జిల్లాలో ఆర్థిక అక్షరాస్యత పెంపొందించడానికి బ్యాంకులు  అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  సబ్సిడిలు మంజూరు కాని వివరాలను, సబ్సిసి గ్రౌడింగ్ అవకుండా విత్ డ్రా అయిన వాటి వివరాలు తేలియజేసి చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు. బ్యాంకు అధికారులు ఋణాల మంజూరులో ఎదురయ్యే సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని,  సబ్సిడిలకు సంబంధించి అప్ లోడింగ్లో సమస్యలు లేకుండా చూడాలని,  సిబిల్ స్కోర్, ఎన్బిఏ, ఓవర్ డ్యూ ఉండి ఋణాల మంజూరుకు అవకాశం లేని వారి వివరాలు యంపిడిఓలకు వ్రాతపూర్వకంగా తెలియజేసి, వారిస్థానంలో అర్హులైన మరొకరికి ఋణాలను మంజూరు చేయాలని సూచించారు.
లబ్దిదారులు పందిరి కూరగాయల సాగుపై ఎక్కువగా అసక్తి చూపించనందున వారిని పాడి పశువుల పెంపకం వైపు మల్లించి ఋణాలను అందిచేలా చుడాలని,  ఎవైన సాంకేతిక సమస్యలు ఎదురైనట్లయితే అధికారులు దృష్టికి బ్యాంకర్లు తీసుకురావాలని సూచించారు. తీసుకున్న ఋణాల తిరిగి చెల్లించేలా చేయడంలో అధికారులు బ్యాంకర్లకు సహాకారం అందించాలని తెలిపారు. ఈ జూమ్ సమీక్షలో లీడ్ బ్యాంకు మేనేజరు పి.వెంకటరెడ్డి, ఈడి.ఎస్సి కార్పొరేషన్ లక్ష్మీనారాయణ, ఎం.పి.డి.ఓ.లు, ఎస్ బి ఐ ఆర్ ఏం, వివిధ బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు , సంబంధిత అధికారులు  పాల్గోన్నారు.

Previous articleజడ్పీ స్కూలు లో రాజ్యాంగ దినోత్సవం
Next articleఅనుమతుల్లేని ప్రైవేటు పాఠశాల బస్సుల పై చర్యలు తీసుకోవాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here