Home ఆంధ్రప్రదేశ్ స్పందన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలి…. బియాండ్...

స్పందన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలి…. బియాండ్ ఎస్ ఎల్ ఎ లో ఒక్క అర్జీ కూడా వుండకూడదు…. అధికారులందరూ స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు

113
0

కర్నూలు, అక్టోబర్ 4

స్పందన అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధితుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కోన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో స్పందన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా)రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్  (అభివృద్ధి) డా మనజీర్ జిలానీ సామూన్, శ్రీశైలం ప్రాజెక్ట్ స్పెషల్ కలెక్టర్ తమీమ్ అన్సారియా,  జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, డిఆర్ ఓ పుల్లయ్య, జడ్పీ సీఈవో వెంకటసుబ్బయ్య, డి ఆర్ డి ఏ పి డి వెంకటేశ్వర్లు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఈ సంధర్బంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ అధికారులందరూ స్పందన కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకుని ఎప్పటికప్పుడు బాధితుల సమస్యలు పరిష్కరించాలన్నారు.
ఇకనుంచి బియాండ్ ఎస్ ఎల్ ఎ లో ఒక్క అర్జీ కూడా ఉండకూడదన్నారు. ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను శనివారంలోపు పరిష్కరించాలన్నారు.
జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారన్నారు.
అధికారులు బాధితుల కష్టాలు గుర్తించి వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

జిల్లాలోని  మున్సిపల్ కమిషనర్ లు 90 డేస్ ఇంటి స్తలాలకోసం వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ (రైతు బరోసా మరియు రెవెన్యూ) రామసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ లకు సూచించారు.
ఇంటి స్తలాలకోసం వచ్చిన అర్జీలన్నీ వాలంటీర్లు ద్వారా పక్కాగా అర్హులను గుర్తించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో  ఎటువంటి సమస్యలున్నా వెంటనే ఉన్నత అధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు.

Previous articleవైకాపా అభ్యర్ది నామినేషన్ దాఖలు
Next articleగోపీచంద్, నయనతార, బి.గోపాల్, జయ బాలాజీ రియల్ మీడియా ‘ఆరడుగుల బుల్లెట్ ట్రైల‌ర్ విడుద‌ల‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here