ఆసిఫాబాద్
జిల్లాలోని గర్భిణీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగే విధంగా గ్రామ స్థాయి నుండి పూర్తి స్థాయి వరకు అవగాహన కల్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ, జిల్లా సంక్షేమ శాఖ, అంగన్వాడి సూపర్వైజర్లు టీచర్ల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. గర్భిణీలకు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగే విధంగా సంబంధిత శాఖ
అధికారులు సమన్వయంతో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏ ఒక్కరు కూడా రక్తహీనతతో బాధపడకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా సమగ్ర పౌష్టికాహారం అందించాలన్నారు. రక్తహీనత లోపాన్ని అధిగమించే విధంగా తీసుకోవాల్సిన
ఆహారం జాగ్రత్తలు గర్భిణులకు అంగన్వాడీ సిబ్బంది వివరించాలన్నారు. జిల్లాలో కోవిడ్ 19 వలన మృతిచెందిన వారి వివరాలు మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి చొరవ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, ఉప వైద్య అధికారి సుధాకర్ నాయక్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.