వికారాబాద్
వికారాబాద్ జిల్లాకుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమం గా వుంది. మరో నలుగురికి
స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఘటన
జరిగింది.మండలపరిలోని ముజాహిద్ పూయ్ లో గల మాడల్ స్కూల్ ,జెపిహెస్ స్కూల్ విద్యర్థులు తమ గ్రామాలు పీరన్ పల్లి ,కుల్కచర్ల కాముని పల్లి గ్రామాలకు చెందిన విద్యార్థులు స్కూల్ సమయం కావడంతో అటుగా కుల్కచర్ల నుంచి
ముజాహిద్ పూర్ కు వెళ్తున్న బొల్లోరో వాహనాన్ని ఆపి ఎక్కి వెళ్తుండగా మార్గమద్యలో మంచుకుంట తాండ సమీపంలో మూల మలుపు ఉండడంతో అతివేగంగా వెళ్తున్న వాహనాన్ని డ్రైవర్ అదుపు చెయ్యలేకపోవడంతో వాహనం ఒక్కసారి క్రింద
పడడంతో ఎనమిది మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. మరో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.కొందరిని కుల్కచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి మరికొందరిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిగి ప్రభుత్వ
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు విద్యార్థులు సిహెచ్ నవీన్ ,బి చరణ్ ,వినేయ్ ,ప్రవీణ్ ల పరిస్థితి విషమించడంతో వారిని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు.
బైట్ :- విద్యార్థి