మధిర
తిరువూరు మధిర రోడ్డు దేవసముద్రం చెరువు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. మండలం లోని ఎరుకోపాడు నుండి తిరువూరుకు 11 మంది కూలీలతో వస్తున్న ఈ ఆటో ప్రమాదంలో కొంగల సుబ్బారావు అనే యువకుడు అక్కడికక్కడే మృత్యువాత పడగా 8 మంది గాయాలపాలయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది .క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధిక వేగం,మద్యం మత్తు ప్రమాదంకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.సంఘటన స్థలంకు చేరుకున్న పోలీస్ లు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు. తిరువూరు ఎస్సై చి హెచ్ దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మండలం లోని అనేక గ్రామాల్లో నాటు సారా,అక్రమ మద్యం విక్రయాలు దిగువ మధ్య తరగతి కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. అధికారులు అడపా,దడపా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికి పరిస్థితిలో మార్పు రావటం లేదంటే అక్రమార్కులకు కఠిన శిక్షలు పడక పోవటం తో మరింత రెచ్చి పోతున్నారు.మహిళా సంరక్షకులు పూర్తి స్థాయిలో విధుల పట్ల అంకిత భావంతో పని చేసి గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాల పట్ల ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందించి నట్లయితే పరిస్థితి మెరుగు పడే అవకాశం ఉందనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయం.