Home ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ పై అవగాహన పెరిగింది మంత్రి తానేటి వనిత

ఎయిడ్స్ పై అవగాహన పెరిగింది మంత్రి తానేటి వనిత

238
0

కొవ్వూరు
అసమానతలను, ఎయిడ్స్ మహమ్మారి ని   తొలగించాలనే నినాదం తో ఈ ఏడాది ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.
బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం నుంచి విజయ విహార్ సెంటర్ వరకు కొవ్వూరు లో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, మునిసిపల్ ఛైర్ పర్సన్ బావన రత్న కుమారి,  జెడ్పిటిసి బి.వెంకట లక్ష్మీ,  తదితరులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. తొలుత జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, గతం కంటే ఇప్పుడు ప్రజల్లో ఎయిడ్స్ పై అవగాహన పెరిగిందని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు కారణం అన్నారు.  అసాంఘిక చర్యలకు పాల్పడడం, చెడు కలయికలు,  కొన్ని సమయాల్లో రక్తం ద్వారా పొరపాటున ఎయిడ్స్ వ్యాధి సంక్రమించడం జరుగుతున్న దని మంత్రి తెలిపారు. ఎయిడ్స్ ఒక వ్యాధి కాదని, చాలా వ్యాధుల సమూహం గా అభివర్ణించ వొచ్చునన్నారు. ఈవ్యాధి సోకిన వ్యక్తి లో ఇమ్మ్యూనిటి శక్తి తగ్గి మరణం సభవిచడం జరుగుతుందని అన్నారు. గతంలో ఎయిడ్స్ వ్యాధితో మరణించే వారని, ఇప్పుడు మెరుగైన వైద్య సేవలు, మందులు వల్ల, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంతమేర జీవన కాలాన్ని పెంచగలుగుతున్నామని పేర్కొన్నారు. వ్యాధిని ద్వేషించండి  వ్యాధి వచ్చిన వారిని కాదు..ని మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ రోజు ఎయిడ్స్ డే. కానీ ఇలాంటి రోజు ఎప్పటికి జరుపుకోకుండా ఉండాలని ఆశ.  అందుకు మనం చేయాల్సింది ఒక్కటే. మనం మన మనసును అదుపులో పెట్టుకోవటమే.  గుర్తు  పెట్టుకోండి ప్లీజ్. మనకు ఎయిడ్స్ రహిత సమాజం   కావాలి” అని అది మనందరిపై ఉన్న భాద్యత అన్నారు. ఈ ర్యాలీలో భాగంగా ఎయిడ్స్ సందేశాన్ని ఇవ్వడం, మానవ హారంగా ఎర్పడి ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్ పర్సన్ భావన రత్న కుమారి, జెడ్పిటిసి బి.వెంకటలక్ష్మి,  కార్పొరేటర్ కోడూరి శివరామకృష్ణ,  ఆసుపత్రి పర్యవేక్షకురాలు డా.ఎమ్. కోటేశ్వరి, ఐసిడిసి కౌన్సిలర్ కె.సుమన్, పలువురు కార్పోరేటర్లు, వైద్యదాధికారు లు, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు, వివిధ పాఠశాలల, కళాశాలవిద్యార్థిని,  విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.

Previous articleత్రాగునీటి కోసం భక్తుల అవస్థలు
Next articleకోతుల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు రాష్ట్రంలో కోతుల బెడద నివారణపై సమావేశం లో సిఎస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here