కోరుట్ల అక్టోబర్ 30
పాన్ ఇండియా అవర్నెస్ ప్రోగ్రాంలో ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో భాగంగా సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జ్ జె.శ్యామ్ కుమార్ సూచనలు మేరకు శనివారం కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో
కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాదులు పలు చట్టాల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రాంసరి నోట్, మోటార్ వాహనాల చట్టం, వృద్ధుల సంరక్షణ చట్టం, ఆస్తి బదలాయింపు చట్టం, పొక్సో యాక్ట్, లోక్ అదాలత్, మహిళలు రక్షణ చట్టాలు, బాల్య వివాహాలు, నిర్భయ చట్టం, మనోవర్తి మొదలగు చట్టాల గురించి న్యాయవాదులు వివరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.సదాశివ రాజు, ప్రధాన కార్యదర్శి బైరి విజయ్ కుమార్, ఉపాధ్యక్షుడు బీమానతి రఘు, ట్రిజరర్ కొంపల్లి సురేష్, సురభి అశోక్, గాంధారి శ్రీనివాస్, గొనె రాజేష్ ఖన్నా న్యాయవాదులు, సర్పంచ్ గుగ్గిళ్ల తుక్కరాం గౌడ్, ఉప సర్పంచ్ ఆరే రాజేశం, ఎంపీటీసీ ప్రియాంక సురేష్, సామల్ల వెంకన్న, పంచాయతీ సెక్రటరీ అనూష ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.