Home తెలంగాణ సఖి సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ రవి

సఖి సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి – జిల్లా కలెక్టర్ రవి

214
0

జగిత్యాల నవంబర్ 13
జిల్లాలో  మహిళలపై వేధింపులు, గృహ హింస,వరకట్నం, లై0గిక దాడులు, ఫోక్సో, సీనియర్ సిటీజన్స్ పై వేధింపులు,బాల్య వివాహాలు, తదితర సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు సఖి కేంద్రం ద్వారా అందించే సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రవి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన లైన్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.ఎన్నికల కోడ్ ముగిశాక  సఖి జిల్లా కేంద్రానికి అన్ని సౌకర్యాలతో కూడిన నూతన భవన నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఫిర్యాదులు వచ్చినప్పుడ సఖి నిర్వాహకులు గోప్యత పాటించాలన్నారు..సఖి త్రైమాసిక సమావేశాలు నిర్వహించడం ద్వారా చేసే పనులు,సహాయాలపై మరింత అవగాహన పొందుతారన్నారు.లాక్ డౌన్ కాలంలో గృహహింస ,తదితర వేధింపులపై  ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం జరిగిందని,పనిచేసే ప్రాంతాల్లో మహిళా ఉద్యోగినులు వేధింపులు ఎదుర్కొంటే ఫిర్యాదు చేయాలన్నారు. గంజాయి,గుడుంబాను అరికట్టడంలో ప్రభుత్వ నిర్దేశాల మేరకు పోలీసు,ఎక్సైజ్ శాఖ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని ,బాల్య వివాహలపై చివరివరకు వేచియుండక అధికారులు క్షేత్ర స్థాయిలోనే సమాచారాన్ని తెలుసుకొని  ఆ తల్లిదండ్రులకు  అవగాహన కల్పించి బాల్య వివాహాలు జరుగకుండా చూడాలన్నారు.ప్రస్తుత జనాభాలో మహిళల సంఖ్య తగ్గిపోతోందని,లింగ వివక్షత లేకుండా అందరినీ సమానంగా చూసినప్పుడే సమాజం ఏర్పడుతుందన్నారు. వయోవృద్ధుల రక్షణ  చట్టంపై   అవగాహన కల్పించాలని, ఏమైనా  ఆర్డీవోల ఆధ్వర్యంలో ట్రిబ్యునల్లకు వయో వృద్దులు తమ పిల్లలు బాధిస్తే ఫిర్యాదు చేయవచ్చన్నారు.జిల్లా టీ ఉద్యోగ జేఏసి గౌరవాధ్యక్షుడుసఖి గౌరవ సలహాదారు  హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో వర్కింగ్ మహిళా ఉద్యోగినుల కోసం   ప్రభుత్వం తరపున హాస్టల్ ఏర్పాటు చేయాలని,జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్లలో అధికారులు వయో వృద్ధులకు  రక్షణ కల్పించాలన్నారు.అన్ని ప్రభుత్వ, ప్రభుత్వర0గ సంస్థల, కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సౌకర్యం కోసం ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు.సఖి కేంద్రానికి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం పట్ల కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపారు.జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేందర్ మాట్లాడుతూ ఆజాధికా అమృత్ మహోత్సవం లో భాగంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూచనల మేరకు   గత నెల 2 నుంచి ఈ నెల 14 వరకు లీగల్ లిటరసీ  కార్యక్రమాలను జిల్లాలో నిర్వహించామని,ఈ కార్యక్రమాల్లో సఖి నిర్వాహకులు చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారని ,న్యాయపరంగా  లీగల్ సర్వీసెస్ అథారిటీ విభాగం ద్వారా  సఖి కేంద్రానికి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాసంక్షేమాధికారి నరేశ్,జిల్లా వైద్యశాఖాధికారి పుప్పాల శ్రీధర్,టీ ఉద్యోగుల జేఏసి గౌరవ అధ్యక్షుడు, సఖి గౌరవ సలహాదారు హరి అశోక్ కుమార్, బార్ కౌన్సిల్ అధ్యక్ష,కార్యదర్శులు సురేందర్,చంద్ర మోహన్,వివిధ  శాఖల అధికారులు,సఖి కేంద్ర అడ్మిన్ మనీలా, సఖి కేంద్ర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Previous articleసోమవారం తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Next articleడిసెంబర్ 9,10 డివైఎఫ్ఐ జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here