తిరుమల,మా ప్రతినిధి ,నవంబర్ 03,
టిటిడి అటవీ శాఖ తిరుమల విభాగంలో ప్రతి ఏటా నిర్వహించే ఆయుధపూజ బుధవారం తిరుమల కట్టెల డిపోలో డిఎఫ్‌వో శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా అటవీ విభాగం వాహనాలను పుష్పగుచ్ఛాలు, అరటి తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించారు. శ్రీవారి చిత్ర పట్టానికి పూజలు నిర్వహించిన అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్.ఆర్.వోలు ప్రభాకర్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, స్వామి వివేకానంద, డిఆర్‌వోశ్రీనివాసులు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.