Home ఆంధ్రప్రదేశ్ బద్వేలు ఉప ఎన్నికల్లో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం సోమువీర్రాజు, సాకే శైలజానాథ్, మేయప్పన్ ల...

బద్వేలు ఉప ఎన్నికల్లో వేడెక్కుతున్న ఎన్నికల ప్రచారం సోమువీర్రాజు, సాకే శైలజానాథ్, మేయప్పన్ ల ఎన్నికల ప్రచారం

116
0

బద్వేలు
బద్వేలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపంసహణ ముగియడంతో ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. ఇప్పటికే అధికార వై.ఎస్.ఆర్.సి.పి కి చెందిన కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎం.పి లు, ఎమ్మెల్సీలు, నాయకులు బస చేసి ఆ పార్టీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ విజయానికి తీవ్రంగా కృషి చేయడంతో పాటు ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. అలాగే బి.జె.పి, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఆదివారం
తమ పార్టీ అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రచారాలు ప్రారంభించారు.
భారతీయ జనతాపార్టీ అభ్యర్థి పి సురేష్ మద్దతుగా భారతీయ జనతాపార్టీ రాష్ర్ట అధ్యక్షులు సోము వీర్రాజు, ఉపాధ్యక్షులు సి ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో
ఆదివారం ఎన్నికల ప్రచారం రథాన్ని ప్రారంభించారు. పార్టీ నాకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. సోము వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ బద్వేలు బస్తీ అవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెబితే కనీసం బద్వేలుకు పంట కాలువలు కూడ నిర్మాణం కాలేదన్నారు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు కు అనుబందంగా కాలువల నిర్మాణం జరగలేదన్నారు.  బ్రహ్మంగారి కాలజ్ఞానం కాలరాసే వారు రాజ్యమేలుతున్నారన్నారు. పులివెందులకు బద్వేలుకు మధ్య అభివృద్ధి వ్యత్యాసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.  కరెంటు కోతలు మాదిరిగానే సంక్షేమ పథకాలకు కోతలు విధిస్తోందని, అందుకే అమ్మవడికి అటెండెన్స్ లింక్ పెట్టారన్నారు.
జాతీయ  ప్రధానమంత్రి నరేంద్రమోదీ బద్వేలు నియోజకవర్గానికి రెండు నేషనల్ హైవేస్ నిర్మించారన్నారు. ఈ నేషనల్ హైవేస్ కు పొలినటు వంటి గ్రామీణ రోడ్ల వ్యవస్థ పై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ వహించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ సడక్ యోజన పథకం క్రింద రోడ్లు వేస్తోందన్నారు. ఇక్కడ నిర్మించిన నేషనల్ హైవే కారణంగా బద్వేలు నుండి విజయవాడకు 4 గంటల్లోపే రాక పోకలు సాగిస్తున్నారన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మచ్చుకొకటి అయినా చూపిస్తారా అని ఆయన ఛాలెంజ్ చేశారు. గ్రామీణాభివృద్ది కృషి చేస్తోంది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. బద్వేలు నియోజకవర్గ వై.ఎస్.ఆర్.సి.పి ఇన్ ఛార్జ్, రాష్ర్ట గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ పార్టీకి  ఓట్లు లేవని విమర్శించారన్నారు. తాను ఛాలెంజ్ చేస్తున్నా  గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు ఇచ్చిందా, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన రెడ్డి ఎక్కువ నిధులు ఇచ్చారా అనే అజెండా పైనే తాము ఎన్నికల ప్రచారం చేపడుతామన్నారు. 14,15 ఫైనాన్స్ నిధులు, స్వచ్ఛ భారత్ నిధులు, జలశక్తి మిషన్,  ఏ నిధులైనా సరే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే రాష్ర్టంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. మీ ప్రభుత్వం తరపున అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి ఇచ్చి వుంటే చెప్పాలని ప్రభుత్వానికి ఛాలెంజ్ చేస్తున్నామన్నారు. జాతీయ రహదారుల నుండి రేషన్ బియ్యం వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ప్రభుత్వ వైఖరి అర్థం కాదన్నారు.
కాగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.ఎం కమలమ్మ విజయానికి పార్టీ రాష్ర్ట అధ్యక్షులు సాకే శైలజానాథ్, పార్టీ వ్యవహారాల  ఇన్ ఛార్జ్ మెయప్పన్, కడప పార్లమెంట్ అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బద్వేలులోని ఎం.ఎన్.ఎస్ కల్యాణ మండపంలో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం  నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థి విజయానికి అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించారు. అనంతరం బద్వేలు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పి.ఎం కమలమ్మ
ఎమ్మెల్యేగా పని చేసిన హయంలోనే బద్వేలు అభివృద్ధి జరిగిందే తప్ప, ప్రస్తుతం ఎటువంటి అభివృద్ధి జరగలేదని, తమ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

Previous article19న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ యాదాద్రి ప‌ర్య‌ట‌న‌
Next articleవైసీపీ నుండి బిజెపి లోకి చేరికలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here