Home తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ పదవీ స్వీకారం

ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ పదవీ స్వీకారం

253
0

హైదరాబాద్
విపత్కర పరిస్థితుల్లో సజ్జనార్ తో పాటు నన్ను మా మీద నమ్మకంతో ముఖ్యమంత్రి  నియమించారు. మమ్మల్ని నియమించిందుకు సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు. సీనియర్ అధికారుల సహకారం తీసుకొని ఒకప్పుడు ఆసియా లొనే నెంబర్ వన్ ఉన్న  సంస్థ ప్రస్తుత నష్టాల పై ముందుకు వెళతాం. రోజుకు 13 కోట్ల ఆదాయం ఉన్న సంస్థ..ఖర్చు 18 కోట్లు అవుతుంది. ఆర్టీసి వల్ల 13 కోట్లు ఉన్న ఆదాయం 10 కోట్లకు తగ్గింది. త్వరలోనే 14 కోట్లకు చేరుకుంటుంది. కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఎండి సజ్జనార్ కష్టపడే వ్యక్తి. ఆయన సహకారం ముఖ్యమంత్రి ఆశీర్వాదం తో ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుతాం. ఇతర దేశాల్లో బస్ స్టాండ్ కు వస్తే బస్సు వచ్చే వరకు టైం పాస్ చేస్తారు. ఇక్కడ ఆటో ఎక్కి వెళ్తున్నారు..అది ప్రమాదకరం. ఆర్టీసి బస్సు సురక్షితమైనది. ము మాటల్లో కాదు చేసి చూపిస్తాం. నాకు ఇది పెద్ద ఛాలెంజ్ అని అన్నారు. కరోన వల్ల నష్టం తో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు డీజిల్ పెరుగుదల వల్ల తీవ్ర నష్టాలు ఉన్నాయి. ప్రతి బస్సుకు ఆరుగురు ఎక్కువ ఉన్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ  కవిత, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేశ్ గుప్తా తదితరులు హాజరయ్యారు.

Previous articleపిడుగుపాటుకు తల్లీకొడుకు దర్మరణం
Next articleదేశం లో తగ్గుముఖం పట్టిన కరోనా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here