విశాఖపట్నం
అరకునియోజకవర్గం, అనంతగిరి మండలం మారుమూల గ్రామాలైన , బారజోల తారురోడ్డు పనులు పూర్తి చేయాలని, జనసేన నాయకుడు సాయిబాబా అధ్వర్యంలో శనివారం నాడు, ఆయా గ్రామంలో పర్యటించి, ముందుగా గిరిజనులతో సమావేశమై చర్చించారు, ముఖ్యంగా ఆయాగ్రామంలో రోడ్డు సదుపాయాలు అందుబాటులో లేకా అభివృద్ధికి ఆమడ దూరంలో అక్కడ గిరిజనులు వున్నారని తెలిపారు, తారు రోడ్డు మంజూరు చేసి నేటికి మూడు సంవత్సరాలు గడిచిన గుత్తేదారు రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపి వేశారు, రోడ్డు పనులోకూడ నాణ్యత లేదు, ఇదివరకు పనులు చేపట్టిన కల్వర్టు లో కూడ నాణ్యతలేని, పనులు చేసే వున్నారని తెలిపారు,ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ , ప్రభుత్వ సంబంధిత అధికారులు తక్షణం ఏభారజోల రోడ్డు పైదృష్టి పెట్టాలని, నాణ్యతలేని రోడ్డు, కల్వర్ట్టు పనులు చేయించినగుత్తేదారుడు పై చర్యతీసుకోవాలని, ప్రభుత్వానికి డిమాండు చేశారు, అనంతరం దీనికై నిరసనగా గిరిజనుల తో పాటు కిలోమీటర్ల దూరంవరకు, ప్రభుత్వానికి నిరసనరూపంలో జనసేన నాయకుడు సాయిబాబా అధ్వర్యంలో చేసారు,ఈకార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసైనికులు దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు