సిద్దిపేట,డిసెంబరు 02
ప్రతి జీవికీ ప్రధానమైనది కన్ను. ఏ పనైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సక్రమంగా సాగిపోవాలంటే కళ్లు కచ్చితంగా బాగుండాలి. విద్యార్థుల కైతే కంటి చూపు బాగుంటేనే విద్యాభ్యాసం సజావుగా జరుగుతుంది. కంప్యూటర్లు, మొబైళ్ల వంటి ఆధునిక పరికరాల వినియోగం కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. చిన్న వయసులోనే పలు రకాల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి.విద్యార్థుల లక్ష్య సాధనకు కంటి చూపు సమస్య ప్రధాన ప్రతిబంధకం అవుతుతుంది. సిద్దిపేట జిల్లాలో విద్యార్థుల దృష్టి సమస్యలను సవరించేందుకు మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు ప్రత్యక చొరవ తీసుకున్నారు.
సిద్దిపేట జిల్లాలోని అంగన్ వాడి నుండి పదవతరగతి వరకు ప్రభుత్వ ,ప్రైవేటు విద్యార్థులకు, ఇంటర్ మీడియట్ నుండి డిగ్రీ వరకు ప్రభుత్వ సంస్థలలో చదివే విద్యార్థులకు వందరోజుల్లో దృష్టి లోపల సవరణ లక్ష్యంతో వంద రోజుల కార్యాచరణ నేటి నుంచే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ శ్రీ యం హనుమంతరావు అధికారులను ఆదేశించారు .
లోపం ఎలాంటిదైనా పరీక్షలు జరపాలి. తగిన చికిత్సను అందించాలి. ఈ కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో జరిపి సమస్యలను గుర్తిస్తేనే , సమస్యల ఆధారంగానే తర్వాతి దశలో చికిత్సలు మొదలవుతాయని మంత్రి భావించారు . అనుకున్నదే తడవుగా ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి గా మంత్రి ఆలోచన ను అమలు చేసేందుకు ముందుకు వచ్చారు . జిల్లా యంత్రాంగం సహకారంతో తొలుత స్క్రీనింగ్ పరీక్ష లు విద్యార్థులు అందరికి నిర్వహించి … ద్రుష్టి లోపాలు ఉన్న విద్యార్థులకు ఎన్నో రకాల కంటి సమస్యలకు మెరుగైన వైద్య చికిత్స అందించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ద్రుష్టి లోపాల సవరణకు చికిత్సలు నిర్వహించనుంది .