వేములవాడ
వేములవాడ పట్టణంలో బతుకమ్మ పండుగ ఏర్పాట్లు తూ.. తూ మంత్రంగా చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి ఆరోపించారు. సోమవారం వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్లోని రెండో బైపాస్ రోడ్డులో బతుకమ్మ తెప్ప వద్ద మంగళవారం జరిగే సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి విలేకర్లతో మాట్లాడుతూ బతుకమ్మ ఏర్పాట్లకు 20 లక్షలు మున్సిపల్ నుండి కేటాయించిన సరిగా ఏర్పాట్లు చేయలేదని అధికారులు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఇట్టి అక్రమాలు నిరోధించడంలో పాలకవర్గం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పట్టణం మొత్తం గుంతల మయంగా మారిందన్నారు. 20 లక్షలు ఎక్కడ ఖర్చు చేశారో..ఏ గుంతలను పూడ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు. లేనియెడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంగ స్వామి యాదవ్, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పాత సత్య లక్ష్మి, కనికరపు రాకేష్, దురిశెట్టి అరుణ్ తేజ చారి, నాగుల విష్ణు ప్రసాద్, నాగుల రాము గౌడ్, తోట లహరి, వస్తాదు కృష్ణ గౌడ్, మర్రి పెళ్లి రాజు, గేంటల ప్రకాష్, దాడి మల్లేశం, నాగుల మహేష్, ఎర్ర శ్రావణ్,మేడే రాజు, తదితరులు ఉన్నారు