Home తెలంగాణ సింగరేణి ఆద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సంబరాలను ప్రారంభించిన జిఎం శ్రీనివాస్

సింగరేణి ఆద్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు సంబరాలను ప్రారంభించిన జిఎం శ్రీనివాస్

239
0

మందమర్రి. అక్టోబర్ 14

సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే బతుకమ్మ సంబరాలను మందమర్రి  ఏరియాలోని సి ఈ ఆర్ క్లబ్ లో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మందమరి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్, సేవా సమితి అధ్యక్షురాలు లక్ష్మి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ బతుకమ్మ ప్యామిలీ డే ఆట పాట కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు, అధికారులకు, సింగరేణి కార్మిక సంఘం నాయకులకు, మహిళలకు పిల్లలకు, ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసారు.   సింగరేణి సంస్థ సిఎండి శ్రీధర్ ఆదేశాల మేరకు సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో భాగంగా వేడుకలను అందరూ కుటుంబ సభ్యులు ఒక్క దగ్గర చేరి ఆహ్లాదంగా గడపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని  తెలియజేశారు.
అలాగే ఈ రోజు నిర్వహిస్తున్న ఈ బతుకమ్మ ఆట పాట కార్యక్రమానికి మీరంతా తరలి రావడం చాలా ఆనందంగా ఉందని వారు అన్నారు.     ఈ సందర్భంగా ఈ వేడుకలలో భాగంగా బతుకమ్మ ఆట, పాట,  బాంబే బ్లాస్ట్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జిఎం గోపాల్ సింగ్, ఎంజిఎం.కెకె గ్రూప్ ఏజెంట్ రామచందర్,సిఎంఓఐ అధ్యక్షులు జక్క రెడ్డి, ఏఐటీయూసీ  బ్రాంచ్ సెక్రెటరీ సత్యనారాయణ, ఇంచార్జ్ పిఎం  శ్యాంసుందర్,      ఉన్నత అధికారులు,   సీనియర్ పీవోలు, సంక్షేమ అధికారులు పాల్గొన్నా ఈ  కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సీనియర్ పిఓ మైత్రేయ బందు వ్యావహరించారు అలాగే సేవా సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Previous articleకౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు, జిల్లా కలెక్టర్
Next articleడప్పు కళాకారులకు డ్రెస్ కోడ్ ల పంపిణీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here