సూర్యాపేట
ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా ఇచ్చే బతుకమ్మ చీరెలను ఆడ పడుచులు తీసుకుని సద్వినియోగం చేసుకోవాలని వార్డు కౌన్సిలర్,వార్డు ఇంచార్జ్ లు మడిపల్లి విక్రమ్,ఎస్.ఎస్.ఆర్ రత్నప్రసాద్,డి.ఇ .బి
వెంకట సత్యారావు లు తెలిపారు. సోమవారం స్థానిక 34 వ వార్డులో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో వారు మాట్లాడారు.ప్రధానంగా వార్డు కు 905 బతుకమ్మ చీరెలు మంజూరు అయ్యాయన్నారు. వీటిని స్థానిక అరుణ అంగన్వాడీ పాఠశాల లో మహిళలకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అరుణ డీలర్ షాప్ కు సంబంధించిన వారు వచ్చే టప్పుడు విధిగా ఆధార్,ఆహార భద్రత కార్డు( రేషన్ కార్డ్)లు వెంట తీసుకొని రావాలని సూచించారు. 5,6 తేదీలలో కూడా ఉ.9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు అరుణ అంగన్వాడీ పాఠశాల లో చీరెల పంపిణీ కార్యక్రమం ఉంటుందని వారు స్పష్టంచేశారు. కావున ఆడపడుచులు హాజరై బతుకమ్మ చీరెలను తీసుకుని వెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు.ఇ కార్యక్రమంలో ఆర్.పి.రోజా, సక్కుబాయి,వల్దాసు భాను చందర్, మోర నరేష్, కాకి అమరెందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.