పెద్దపల్లి సెప్టెంబర్ 30
జిల్లాలో అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ కి అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయుటకై చేపట్టాల్సిన చర్యల పై జిల్లా కలెక్టర్ గురువారం తహసీల్దార్లు, మండల ప్రత్యేక అధికారులతో పంపిణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించడం జరిగింది. జిల్లాలో తెలుపు రేషన్ కార్డుల ప్రకారం 18 సంవత్సరాలు నిండిన 275086 మహిళలందరికి తెలంగాణ ప్రభుత్వం ద్వారా బతుకమ్మ కానుకగా చీరల పంపిణి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర పండుగ బతుకమ్మ నాడు పేదింటి ఆడపడుచుల అందరికీ చీరలను కానుకగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, రేషన్ షాపు డీలర్ మరియి గ్రామ సమైక్య కమిటీ గా ఏర్పడి పంపిణి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన మహీళలందరు ఆధార్ కార్డు లేదా ఇతర ఫోటో ఐడెంటికార్డ్ ద్వారా గుర్తించి మహిళలు పంపిణి చేసే బతుకమ్మ చీరలు తీసుకోవాలని కోరారు. 60 సంవత్సరాలు నిండిన పెద్ద మనుషులకు 9 మీటర్లు మరియు ఇతరులకు 6 మీటర్ల చీరలు పంపిణి చేయబడుతుందని తెలిపారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయవలసిందిగా సంబంధిత అధికారకు కలెక్టర్ సూచించారు.
అనంతరం జిల్లా కు వచ్చిన బతుకమ్మ చీరలను కలెక్టర్ ఆవిష్కరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, ఎ. పి.డి.సునీత, డి.పి.యం. తిరుపతి,సంబంధిత అధికారులు తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.