వేములవాడ
వేములవాడ పట్టణ ప్రజలకు దసరా పండుగ సందర్బంగా పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ దసరా పండుగను అందరూ ఆనందం గా జరుపుకోవాలని, దసరా సందర్బంగా ఎలాంటి
అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి నేర చరిత మరియు రౌడీ షీటర్ల మీద ప్రత్యేక నిఘా ఉంచాం అని, దసరా రోజు పాత గొడవలు మనసులో పెట్టుకుని ఏవైనా అవాంఛనీయ సంఘటనల కు పాల్పడ్డ కఠిన చర్యలు
తప్పవు అని జాగ్రత్త గా ఉండాలి అని, పండుగ సందర్బంగా ఇంటిల్లిపాది ఊరికి వెళితే ఇంట్లో విలువైన ఆభరణాలు, నగదు లేకుండా చూసుకోండి, మీ పక్కింటి వారికి కానీ పోలీస్ వారికి కానీ సమాచారం ఇచ్చి వెళ్ళండి,ప్రతీ ఒక్కరు పండుగను శాంతి
యుతంగా ఆనందంగా జరుపుకోవాలని కోరారు.