బేతంచర్ల
బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికలు బాహాబాహీ గా జరిగాయి 17వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కాగా అందులో వైసిపి 14 వార్డులను కైవసం చేసుకోగా మిగతా ఆరు వార్డులను టిడిపి అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. వైసీపీకి 11069 ఓట్లు రాగా టిడిపికి 9538 ఓట్లు వచ్చాయి 1531 ఓట్ల మెజారిటీతో వైసిపి గెలుపొంది బేతంచర్ల నగర పంచాయతీ చేజిక్కించుకుంది, ఆర్థిక శాఖ మంత్రి అయిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత గ్రామమైన బేతంచెర్ల పట్టణంలో టిడిపి అభ్యర్థులు 6 వార్డులను కైవసం చేసుకొవడం మంత్రి సొంత ఊరిలోనే 1531 అతి తక్కువ మెజార్టీతో గెలుపొందడం పట్ల రాబోయే ఎన్నికల్లో టిడిపి పార్టీ గట్టిపోటీ ఇస్తుందని విశ్లేషకులు చెప్పుకొచ్చారు. దీనికి అధికార పార్టీ అభ్యర్థులు తామే 20 వార్డులు కైవసం చేసుకుంటామని అతి విశ్వాసమే కొంపముంచిందా? ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ మాత్రం రాబోయే ఎన్నికల్లో గట్టిగా కృషి చేస్తే తప్పా ప్రత్యర్థుల ను ఎదుర్కోలేదా? అనే సందేహాలను నిపునులు వ్యక్తం చేస్తున్నారు.