కొత్తగూడెం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండలం లోని మర్కొడు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సంతోష్, భాగ్యలక్ష్మి దంపతులకు ఇద్దరూ ఆడపిల్లల ఉన్నారు. మూడో కాన్పుకోసం భాగ్యలక్ష్మి ని ఈ నెల 17వ తేదీన ఉదయం కొత్తగూడెం లోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా సాయంత్రం వరకు ఆమెను పర్యవేక్షణ లో ఉంచి ఆ తరువాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. కానీ మరో గర్భిణీ వచ్చాక ఇద్దరి కి ఒకేసారి ఆపరేషన్ చేద్దామని కుటుంబ సభ్యులకు చెప్పిన వైద్యులు రాత్రి తొమ్మిది గంటల కు వచ్చిన గర్భిణీ తో కలిపి భాగ్యలక్ష్మి ఆపరేషన్ థియేటర్ కు తరలించారు. ఆ తర్వాత ఒంటి గంట ప్రాంతంలో బయటకు వచ్చిన వైద్యులు కడుపులో ఉన్న శిశువు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తల్లి ని మాత్రమే కాపాడగలమని చెప్పడంతో కుటుంబ సభ్యులు సరేనన్నారు. దింతో ఆపరేషన్ చేసి బాబు పరిస్థితి విషమంగా ఉందని భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. దింతో మరుసటి రోజు ఉదయం బాబు మరణించాడు. దీంతో భాగ్యలక్ష్మి వద్దకు చేరుకున్న బంధువులు కు భాగ్యలక్ష్మి సృహలోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సిబ్బంది ని ప్రశ్నించారు. దింతో ఆమెను పరిక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఖమ్మం లేదా వరంగల్ తరలించాలని చేప్పడంతో తోచేది లేక గ్రామస్తుల సహకారంతో ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆమెను పరీక్షించి న వైద్యులు ఆమె మెదడు లో రక్తం గడ్డ కట్టిందని ఆమెకు మూడు రోజులు వైద్య సేవలు కొనసాగించి. అప్పటికి ఆమె కోమ నుండి రాకపోవడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గత పదిరోజులు గా మృత్యువు తో పోరాడిన భాగ్యలక్ష్మి తుదిశ్వాస విడిచారు. దింతో భాగ్యలక్ష్మి మృతికి కొత్తగూడెం ప్రభుత్వ వైద్యులే కారణంఅని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి కోసం ఇద్దరూ చిన్నారులు ఎదురుచూస్తున్నారని దిని అంతటి కి ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ సరళ నిర్లక్ష్యమే కారణం అని వెంటనే ఆమెను విధుల నుండి తొలగించి మృతి చెందిన భాగ్యలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వమే అదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Home తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఏరియా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కాన్పు కోసం వచ్చి కోమాలోకి...