భద్రాచలం సెప్టెంబర్ 30
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు భాగంగా గురువారం ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి రామయ్యకు సుప్రభాత సేవ, ఆరాధన సేవాకాలం, నిత్య బలిహరణం, నిత్య హోమాలు నిర్వహించారు.అనంతరం శ్రీసీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను బేడా మండపంలో వేంచేపు చేసి ముందుగా విశ్వక్సేన ఆరాధన, ఫుణ్యఃవచనం చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం జరిపించారు.