పెద్దపల్లి
నవంబర్ 25
:
పెద్దపెల్లి జిల్లా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన లక్షా యువగల గీతర్చన భగవద్గీత రథయాత్ర గురువారం రామ్మందిర్ శ్రీ కోదండ రామాలయం నుండి ప్రారంభమైనది. ఈ కార్యక్రమంలో శ్రీ పరబ్రహ్మానందగిరి స్వాములవారు, తెలంగాణ రాష్ట్ర విశ్వహిందూ పరిషత్ సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి పాల్గొని రథయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అధిక సంఖ్యలో మరియు బిజెపి రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్, బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మీ నరసయ్య, మావోజూ రామన్న, మామిడి రాజేష్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.