బేతంచెర్ల,
మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో సోమవారం నాడు భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా బేతంచెర్ల మండలం లో వామపక్షాలు అయినా సి. ఐ. టి. యు, టి.డి.పి పార్టీల ఆధ్వర్యంలో భారత్ బంద్ ను చేపట్టారు. మొదటగా పట్టణంలో ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి. యు జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లయ్య , ఈశ్వరయ్య లు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకు వచ్చి ప్రజల నటిస్తున్నాడని, విద్యుత్ బిల్లులు పెంచి ప్రజలపై భారాలు మోపుతున్నారని వెంటనే వీటిని రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెలుగు ప్రజలు పోరాడి ప్రాణాలకు తెగించి సాధించుకున్నది విశాఖ ఉక్కు అని దాన్ని ప్రైవేటు పరం చేయడం భావ్యం కాదని దీన్ని ఎలాగైనా రక్షించుకుంటాం అన్నారు. కౌలు రైతులకు రక్షణ కోసం చట్టం తేవాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిత్యావసర ధరలు వెంటనే తగ్గించాలని వారి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి. ఐ. టి. యు నాయకులు , ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, కార్మికులు పాల్గొన్నారు.