కడప సెప్టెంబర్2
కడప నగరంలో సోమవారం రైతు కార్మిక, పార్టీ, ప్రజాసంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాల నేతృత్వంలో బందు నిర్వహించారు. ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక పాలెంపల్లె వద్ద నుండి కోటి రెడ్డి సర్కిల్ వరకు రైతులు టాక్టరు లో మోడీ దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకొని వచ్చి కోటిరెడ్డి కూడలి వద్ద కూరగాయలు రోడ్డుపై పారబోసి మోడీ అంబానీ ఆదాని మూడు తలల దిష్టి అమ్మను దగ్ధం చేయడం జరిగింది. దిష్టి బొమ్మ దగ్ధం చేయడాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రైతు సంఘం నాయకులపై దాడికి యత్నించారు, ఈ సందర్భంగా తోపులాట, స్వల్ప ఉద్రిక్తతల మధ్య ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర కు చేతులు కాలి గాయాలయ్యాయి.
ఈ క్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఏ వి రమణ, విజయలక్ష్మి, దస్తగిరి రెడ్డి, మనోహర్ రెడ్డి, శంకర్ రెడ్డి, జయన్న, చంద్రశేఖర్ రెడ్డి, రామాంజనేయులు రెడ్డి ,కొండయ్య, టి రామ్మోహన్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జుల వలరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఓబులేసు, శివ శంకర్, సంజీవ్, కటారి శివ, శంకర్ నాయక్, మల్లెల లింగారెడ్డి, హరి ప్రసాద్ అమీర్ బాబు, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.