జగిత్యాల రూరల్ మండలం సంగంపల్లి గ్రామంలో చత్రపతి శివాజీ విగ్రహానికి సర్పంచ్ అంకతి మల్లయ్య భూమి పూజ చేశారు. గ్రామస్తుల సహకారం తో ఏర్పాటు చేయనున్న ఈ విగ్రహా భూమి పూజ కార్యక్రమం లో ఉప సర్పంచ్ సంద వినోద్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడ్డ చత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడం ద్వారా యువతలో ధర్మం పట్ల, హిందూ సంస్కృతి పట్ల భక్తి భావం పెంపొందుతాయన్నారు. విదేశీ పాలనలో హిందువులు ఎన్నో ఇబ్బందులు పడుతూ తమ సంస్కృతి, సాంప్రదాయాలకు దూరం అవుతున్న తరుణంలో చత్రపతి శివాజీ హిందూ ధర్మ రక్షకుడు గా నిలిచి ధర్మాన్ని కాపాడారన్నారు. అతి సామాన్య కుటుంబంలో జన్మించి ధర్మరక్షణ కోసం మొగల్ చక్రవర్తి ఔరంగజేబు ను ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మహనీయుడు చత్రపతి శివాజీ అని కొనియాడారు. శివాజీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ధర్మరక్షణకు కృషి చేయాలని కోరారు.