కౌతాళం
మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని గురువారం వైసిపి నాయకులు ధరణి యూత్ కార్యకర్తలు అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉదయం ఉరుకుంద గ్రామంలో లో నరసింహ స్వామి పుణ్యక్షేత్రం లో ప్రత్యేక పూజలు నిర్వహించి బైకు ర్యాలీ వైసిపి నాయకులు మండల నాయకులు దేశయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా ఉన్నత పాఠశాల చైర్మన్ వడ్డే రాముడు ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మూడు సార్లు గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నో అభివృద్ధి పనులు చేసి చూపించారని పేర్కొన్నారు వారికి మంత్రి పదవి ఇవ్వాలని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉరుకుంద నుంచి శ్రీశైలం వరకు బైకు ర్యాలీ నిర్వహిస్తున్నామని శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మంత్రి పదవి ఇచ్చేంతవరకు పోరాడుతామని తెలిపారు. మంత్రి పదవి వస్తే గ్రామాల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు దేశాయి కృష్ణ ఉప ఎంపిపి బుజ్జి స్వామి, సర్పంచ్ పాల్ దినకర్, ఉప సర్పంచ్ తిక్కయ్య ,మాజీ సర్పంచ్ అవతారం, జిల్లా ఉన్నత పాఠశాల చైర్మన్ వడ్డె రాముడు, కార్యకర్తలు వైసిపి ధరణి యూత్ ,భీమ యూత్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కి మంత్రి పదవి ఇవ్వాలని బైక్ ర్యాలీ ఉరుకుంద నుంచి శ్రీశైలం...