పెద్దపల్లి నవంబర్ 25
సిబ్బందిలో జవాబుదారీతనం పెంపొందించడానికి బయో మెట్రిక్ హాజరు విధానం పునః ప్రవేశపెట్టాలని రామగుండం నగర పాలక సంస్థ కమీషనర్ (ఎఫ్ఎసి) శంకర్ కుమార్ మునిసిపల్ కార్యాలయ మేనేజర్ కు ఆదేశాలు జారీ చేసారు. గురువారం ఉదయం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలోని అన్ని విభాగాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కారాదని అన్నారు. నిబంధన ల ప్రకారం మధ్యాహ్నం అరగంట మాత్రమే భోజన విరామ సమయం పాటించాలని సూచించారు. ఇక నుండి విధులకు సకాలంలో హాజరు కాకపోయినా, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని అన్నారు.